- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలం ఎఫెక్ట్.. RTC బస్సులోనే ఇన్నర్ వేర్ ఆరబెడుతూ !
ఇన్నర్ వేర్... చేతులతో పట్టుకొని.. బయట ఆరబెట్టాడు. బస్సు వెళ్లే వేగానికి ఆ ఇన్నర్ వేర్ పూర్తిగా ఆరిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో... ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు అలాగే కుంటలు పూర్తిగా నిండి.. మత్తళ్లు కూడా దూకుతున్నాయి.
ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో... ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తున్నారు. ఇక.. ఈ వర్షాల దెబ్బకు సూర్యుడు అస్సలు రావడం లేదు. దీంతో పిండిన బట్టలు ఏమాత్రం వినడం లేదు. ఇక మగాళ్ళ ఇన్నర్ వేర్లు... అస్సలు ఎండటం లేదని చాలా బాధపడుతున్నారు. అయితే ఈ బాధతో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సులోనే... తన ఇన్నర్ వేర్ ఆరబెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణకు సంబంధించిన ఓ వ్యక్తి... ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ.. మిడిల్ సీట్లో కూర్చున్నాడు. అయితే ప్రయాణం ఎక్కువసేపు ఉన్న నేపథ్యంలో.. తన ఇన్నర్ వేర్... చేతులతో పట్టుకొని.. బయట ఆరబెట్టాడు. బస్సు వెళ్లే వేగానికి ఆ ఇన్నర్ వేర్ పూర్తిగా ఆరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్.. చేస్తున్నారు. మనోడికి.. ఒకటే ఉన్నట్టుంది... అందుకే బస్సులో కూడా ఆరబెడుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. క్లిక్






