- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరటిపండు కోసం కోతుల ఆరాటం..కారు ఓనర్ పై నెటిజెన్స్ ఫైర్
అరటిపండు కోసం కోతుల ఆరాటానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీగా సాగే వీడియోలతో పాటు భయానకమైనవి కూడా ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా అరటి పండు కోసం కోతులు ఆరాటపడిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లోని ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది. బీహార్ కు సంబంధించిన ఓ మారుమూల గ్రామంలో ఒక కారు డ్రైవర్, కోతుల గుంపులు చూసి కారును ఆపేశాడు. ఆ తర్వాత బయటకు కనిపించేలా కారు లోపల మిర్రర్ భాగంలో ఓ అరటిపండు ఉంచాడు. ఈ నేపథ్యంలోనే ఆ అరటిపండును తీసుకునేందుకు రెండు కోతులు ఎగబడ్డాయి.
వీడియోలో చూపించినట్లుగా, మిర్రర్ అడ్డుగా ఉన్న నేపథ్యంలో అరటిపండును తీసుకునేందుకు చాలా కష్టపడ్డాయి కోతులు. ఇక ఆ కోతుల ఆరాటాన్ని లోపల కూర్చుని కారు డ్రైవర్ క్యాప్చర్ చేశాడు. వ్యూస్ కోసం ఇలాంటి పని చేసిన కారు డ్రైవర్ పైన నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులకు అరటిపండు ఆశ చూపించి, ఇలా వ్యవహరించడం చాలా తప్పు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లపై కేసులు పెట్టి బొక్కలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండాకాలం మూగజీవులతో ఆడుకోవడం నేరమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






