- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతి చేతికి నోట్ల కట్టలు.. ఏం చేసిందందో చూస్తే అవాక్కవ్వాల్సిందే
మనుషులకు డబ్బులు దొరికితే ఎగిరి గంతేస్తారు. ఆ డబ్బులు దాచుకోవా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: మనుషులకు డబ్బులు దొరికితే ఎగిరి గంతేస్తారు. ఆ డబ్బులు దాచుకోవా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తారు. నచ్చింది కొనుక్కుంటూ పండగ చేసుకుంటారు. నిజాయితీ పరులు అయితే వాటిని తిరిగి ఇచ్చేస్తారు. కానీ అదే కోతికి డబ్బు దొరికితే ఎలా ఉంటుంది. పాపం ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక తికమక పడుతుంది. కోతి చేష్టతో చింపివేస్తుంది లేదా విసిరిపారేస్తుంది.
తాజాగా కోతికి డబ్బుల బ్యాగ్ దొరికిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడై కెనాల్ లో జరిగినట్టు తెలుస్తోంది. బ్యాగులో తిను బండారాలు ఉన్నాయనుకున్న కోతి టూరిస్టు దగ్గర నుండి ఆ బ్యాగును ఎత్తుకెళ్లింది. కానీ అందులో ఏం దొరక్క పోవడంతో నిరాష చెందింది. కానీ అదే బ్యాగులో కోతికి నోట్ల కట్టలు దొరికాయి. ఇక వాటిని ఏం చేయాల తెలియక చెల్లాచెదురుగా విసిరిపారేసింది. నోట్ల కట్టలో అన్నీ రూ.500 నోట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.






