- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. పొట్టుపొట్టు కొట్టిన తల్లి
తల్లి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తుందో తప్పు చేస్తే అదే స్థాయిలో శిక్షిస్తుంది. బిడ్డలు ఏ వయసులో ఉన్నా తప్పు చేస్తే దండిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: తల్లి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తుందో తప్పు చేస్తే అదే స్థాయిలో శిక్షిస్తుంది. బిడ్డలు ఏ వయసులో ఉన్నా తప్పు చేస్తే దండిస్తుంది. తాజాగా ఓ తల్లి తన కొడుకుకు వద్దని చెప్పినా వినకుండా అమ్మాయితో తిరగడంతో రోడ్డుపైనే చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh)లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోహిత్(rohith) అనే యువకుడు తన ప్రేయసితో కలిసి రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్దకు స్నాక్స్ తినేందుకు వెళ్లాడు. అది గమనించిన తల్లి అతడి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరినీ రోడ్డుపై పట్టుకున్నారు.
అయితే యువకుడి తల్లి సుశీల అతడి తండ్రి శివకరణ్ సదరు యువతితో తిరగవద్దని చాలా సార్లు హెచ్చరించారట. అయినా చెప్పినమాట వినకపోవడంతో రోడ్డుపైనే చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న రోహిత్ కుటుంబ సభ్యుడు యువతిని అక్కడ నుండి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించాడు. కానీ ఆ యువతి మాత్రం పక్కకి వెళ్లకుండా అతడి పక్కనే నిలుచుని చూస్తూ ఉంది. యువకుడు తాను ఆమెను ప్రేమిస్తున్నానని తమను వదిలేయాలని తల్లిని ప్రాదేయపడ్డాడు.
అయినప్పటికీ ఆ తల్లి కనికరించకుండా రోడ్డుపై తిడుతూ కొట్టింది. ఆ యువతితో తిరగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుపై గొడవ జరగటంతో చాలా మంది అక్కడకు చేరుకున్నప్పటికీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. చివరికి యువతిని అక్కడ నుండి పంపించడంతో గొడవ సద్దుమనిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది మంచిపనిచేశారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు, అతనికి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయవచ్చుగా ఇలా రోడ్డుపై కొట్టడం ఏంటి అంటూ యువకుడికి సపోర్ట్ చేస్తున్నారు.






