పదోతరగతిలో తప్పిపోయి ఏడేళ్లకు తిరిగొచ్చాడు..పేరెంట్స్ రియాక్షన్ చూస్తే కన్నీళ్లు ఆగవు

by Ajay Maddhiboyina |

లేడేమో ఇక రాడేమో అనుకున్న కొడుకు త‌ల్లిదండ్రుల ముందుకు తిరిగి వ‌స్తే వారి ఆనందానికి అవ‌దులు ఉండ‌వు.

పదోతరగతిలో తప్పిపోయి ఏడేళ్లకు తిరిగొచ్చాడు..పేరెంట్స్ రియాక్షన్ చూస్తే కన్నీళ్లు ఆగవు
X

దిశ, వెబ్ డెస్క్: లేడేమో ఇక రాడేమో అనుకున్న కొడుకు త‌ల్లిదండ్రుల ముందుకు తిరిగి వ‌స్తే వారి ఆనందానికి అవ‌దులు ఉండ‌వు. అలాంటి ఘ‌ట‌నే క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. క‌ర్నాట‌క‌కు చెందిన రాజు కాక‌సాహెబ్ మాలి అనే యువ‌కుడు త‌న‌కు 16ఏళ్ల వ‌యసు ఉన్న‌ప్పుడు, ప‌దోత‌ర‌గ‌తిలో ఉండ‌గా త‌ప్పిపోయాడు. అత‌డి తల్లి దండ్రులు నిర‌క్ష‌రాస్యులు కావ‌డం, దిన‌స‌రి కూలీలు కావ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించి మిస్సింగ్ కేసు కూడా న‌మోదు చేయ‌లేక‌పోయారు.

2017లో రాజు త‌ప్పిపోతే 2023లో కుటుంబ స‌భ్యులు మ‌రో వ్య‌క్తి స‌హాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎంతో శ్ర‌మించి రెండేళ్ల త‌ర‌వాత అత‌డి ఆచూకీ క‌నుగొన్నారు. రాజు పూనేలో ఉన్న‌ట్టు గుర్తించారు. అత‌డిని తీసుకువ‌చ్చి వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించగా వాళ్లు ఎంతో సంతోష‌ప‌డ్డారు. కొడుకును చూడ‌గానే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. యువ‌కుడి త‌ల్లి అత‌డిని హ‌త్తుకుని ఏడ్వ‌డం అక్క‌డే ఉన్న పోలీసుల హృద‌యాల‌ను సైతం క‌దిలించింది. దీంతో వారు సైతం క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా హ్యాపీ ఎండింగ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. video

Next Story