- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యావ్.. పిల్లి అరుపుతో బుక్.. లాంగ్వేజ్ కూడా పిల్లిదే.. అమెజాన్ లో రేటెంతో తెలిస్తే షాకే
ఎక్స్ లో ఓ యూజర్.. ఒక మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను షోర్ చేశాడు. ఆమె ఆవేదనకు కారణం ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు MEOW.

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ ఇంటర్నెట్, సోషల్ మీడియానే కాదు.. బుక్స్ కూడా చదవాలి. రైటర్లు రాసిన నవలలు చదివితే మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. పుస్తక పఠనం జ్ఞానంతోపాటు ఆసక్తిని కూడా పంచుతుందంటారు. చాలా భాషల్లో అనేక నవలలు ఉంటాయి. కానీ పిల్లి భాషతో ఒక నవలను ఎప్పుడైనా చదివారా? కనీసం చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి.
342 పేజీలు.. 80వేల సార్లు మ్యావ్
ఎక్స్ లో ఓ యూజర్.. ఒక మహిళ ఆవేదన చెందుతున్న వీడియోను షోర్ చేశాడు. ఆమె ఆవేదనకు కారణం ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు MEOW (మ్యావ్). సామ్ ఆస్టెన్ అనే సాటైరిస్ట్ ఈ బుక్ ను రాశాడు. పోనీ ఆ బుక్కేమైనా అందరికీ అర్థమయ్యేలా ఉందా అంటే కాదు. బుక్కంతా Meow Meow Meow అనే రాశాడు. 342 పేజీల్లో.. దాదాపు 80 వేలసార్లు మ్యావ్ అనే రాశాడు. రామజపం చేసినట్లు.. మ్యావ్ జపం చేసినట్లుగా ఉంది ఆ బుక్. పుస్తకాన్ని కొన్న ఒక మహిళ.. అసలు ఆ రైటర్ కు బుద్ధి ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. పుస్తకం ఇంట్రెస్టింగ్ గా కనిపించడంతో 19 డాలర్లు పెట్టి మరీ కొన్నానని, ఇంత చీట్ చేస్తారనుకోలేదని వాపోయింది. ఆమె అలా రైటర్ ను తిడుతుంటే పక్కన ఆమె పిల్లలు మ్యావ్ మ్యావ్ మ్యావ్ అంటూ.. నవ్వుతున్నారు.
ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు సెకండ్ వెర్షన్ కోసం వెయిటింగ్ అంటున్నారు. మరికొందరు ఈ బుక్ రాసిన రైటర్.. అది అమ్ముడయ్యి డబ్బులొస్తే పండుగ చేసుకుంటాడంటున్నారు. ఈ పిల్లిభాష ఎవరికి అర్థమవుతుందని సామ్ ఆ బుక్కు రాశాడని ఇంకొందరు ఫైరవుతున్నారు.
పిల్లులకు సాహిత్యం అర్థమయ్యేందుకు?
రైటర్ సామ్ ఆస్టెన్ విషయానికొస్తే.. గోల్డెన్ సటేట్ మెడికల్ యూనివర్సిటలో ఫైలైన్ సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసినట్లు సమాచారం. ప్రపంచ సాహిత్య రచనలను పిల్లులకు అర్థమయ్యేలా మ్యావ్ భాషలోకి అనువదించడం ఆయన ముఖ్య ఉద్దేశమట. ఇందుకోసం "ద మ్యావ్ లైబ్రరీ"ని కూడా స్థాపించడం గమనార్హం. అందుకే సామ్ ఆస్టెన్ కు సర్టిఫైడ్ ఫైలైన్ లింగ్విస్ట్.. అంటే పిల్లుల భాషా నిపుణుడు అనే పేరు కూడా ఉంది. "మ్యావ్ : ఎ లిటరరీ పాడ్ కాస్ట్ ఫర్ కాట్స్" అనే పాడ్ కాస్ట్ ను కూడా నిర్వహించడం కొసమెరుపు. "Meow - A Novel" అనే పుస్తకాన్ని కూడా పిల్లుల కోసం రాసిన నవలగా చెప్పడం మరో వింత. వాటికేం తెలుసు వాటి భాషలో ఒక పుస్తకం కూడా ఉందని? అసలు పిల్లులకు అర్థమయ్యేలా భాషలో సాహిత్య నవలలను అనువదంచడం ఏంటి? పిల్లులేమైనా పుస్తకాలు కొనుక్కుని చదువుతాయా? అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాహిత్య ప్రపంచంపై వ్యంగ్య ప్రదర్శనా?
సామ్ ఆస్టెన్ నిజంగా పిల్లుల కోసం ఆ బుక్ రాయలేదని, సాహిత్య ప్రపంచంపై వ్యంగ్యంగా రాశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఎన్నో అనవసరమైన, అర్థం లేని పుస్తకాలు వస్తున్నాయని, వాటిని కూడా జనం గొప్పగా ఫీలవుతారని వెక్కిరించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. "ఏమీ లేని పుస్తకాన్ని కూడా నేను అమ్మగలను" అని నిరూపించడం ఒక రకమైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ అంటున్నారు. అలాగే.. మ్యావ్ మ్యావ్ అంటూ ఆ పుస్తకం రాసిందెవరంటూ సోషల్ మీడియా, మీడియాలో చర్చ మొదలైతే.. రైటర్ పాపులర్ అవుతాడని, సామ్ మ్యావ్ బుక్ రాయడం వెనుక ఈ కోణం కూడా ఉండి ఉండొచ్చంటున్నారు. అమెజాన్ లో ఈ పుస్తకం ధర రూ.2157 ఉండగా.. ఆఫర్లో రూ.1675కు అమ్ముతున్నారు. అతను రాయడం, వీళ్లు అమ్మడం.. పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
అమెజాన్ లో బుక్ పై 400కు పైగా రివ్యూలు ఉండగా.. 4.7 స్టార్ రేటింగ్ ఉండటం షాకయ్యేలా చేస్తుంది. పిల్లుల ప్రేమికులకు ఆ బుక్ విలువ అర్థమవుతుందని, రైటర్ మంచిపనిచేశాడని అంటున్నారు. ఏంటో భయ్యా ఈ పిల్లుల గోల.. అంతా మ్యావ్ మ్యావ్ మ్యావ్.






