మగాడంటే నువ్వేరా బుజ్జి.. తాళి కట్టే ముందు పర్మిషన్ అడిగిన పెళ్లికొడుకు.. కన్నీటి భాష్పాలతో ఓకే చెప్పిన వధువు..(క్యూట్ వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-19 10:21:56  IST  )

ప్రజెంట్ పెళ్లి అంటే జీవితానికి ఎండ్ కార్డ్ పడిపోయినట్లే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రియుడితో చెక్కేయడానికి భార్య, భర్తను చంపుతుంటే.. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు భర్త, భార్య ప్రాణం తీస్తున్నాడు. ఇలాంటి టాపిక్ నార్మలైజ్ అయిన ఈ కాలంలో ఈ వీడియో ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తోంది

మగాడంటే నువ్వేరా బుజ్జి.. తాళి కట్టే ముందు పర్మిషన్ అడిగిన పెళ్లికొడుకు.. కన్నీటి భాష్పాలతో ఓకే చెప్పిన వధువు..(క్యూట్ వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ పెళ్లి అంటే జీవితానికి ఎండ్ కార్డ్ పడిపోయినట్లే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రియుడితో చెక్కేయడానికి భార్య, భర్తను చంపుతుంటే.. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు భర్త, భార్య ప్రాణం తీస్తున్నాడు. ఇలాంటి టాపిక్ నార్మలైజ్ అయిన ఈ కాలంలో ఈ వీడియో ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తోంది. అవును.. ఇద్దరు పదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ. ఇరుకుటుంబాలను ఒప్పించి ఆఖరికి పెళ్లి పీటల వరకు వచ్చారు. కానీ ఆ అమ్మాయి.. తల్లిదండ్రులకు దూరమవుతున్నాననే బాధతో ఉండటం గమనించిన పెళ్లి కొడుకు.. ఓయ్ తాళి కట్టనా అని తన అంగీకారం అడిగాడు. ఇందుకు ఆమె కన్నీటి భాష్పాలతో ఓకే చెప్పి తాళి కట్టించుకుంది. మెడలో పడగానే దాన్ని మొక్కి సంతోషంతో నవ్వేసింది.

ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు.. మగాడంటే ఇతడు అని కామెంట్స్ చేస్తున్నారు. తాళి కట్టే ముందు ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవడం ఏదైతో ఉందో.. అక్కడే పడిపోయామని.. ఇలాంటి వీడియోలు చూస్తుంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుందని అంటున్నారు. ఫ్యూచర్ జర్నీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ.. పిల్లాపాపలో కలకాలం సంతోషంగా ఉండమని దీవిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్లే ఇంకా ప్రపంచం ముందుకు సాగుతుందంటున్నారు నెటిజన్లు.

CUTE VIDEO

Next Story