- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ఇలా కూడా చేస్తారా! స్కూటీపై వార్డులో తిరుగుతూ వైద్య సేవలు?
స్కూటీపై సన్ గ్లాసెస్ పెట్టుకొని మరి ఒక వార్డు నుంచి మరో వార్డుకు నర్సు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్కూటీపై సన్ గ్లాసెస్ పెట్టుకొని మరి ఒక వార్డు నుంచి మరో వార్డుకు నర్సు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన యూపీలోని ఫిల్ బిత్ జిల్లా ఆస్పత్రి జరిగింది. పిలిభిత్ ఆస్పత్రిలో రద్దీగా ఉండే హాస్పిటల్ వార్డులో స్టాఫ్ నర్సు స్కూటర్ నడిపింది. ఆసుపత్రి ఓపీడీ వార్డు నుంచి ఆమె మరో వార్డుకు వెళ్తున్న దృశ్యాలు వీడియోలో కన్పిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశంలో తన స్కూటర్‌ను క్యాజువల్‌గా నడుపుతోంది.
రోగులకు అసౌకర్యం కలిగించినప్పటికీ, నర్సు అద్దాలు ధరించి వార్డు గుండా వెళ్ళడం వివాదాస్పదమైంది. ఆస్పత్రి పెద్దది కావడంతో నర్సు ఇలా స్కూటీపై వెళ్లి ఉండొచ్చని ఆస్పత్రి వర్గాలు సమర్థించుకున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. అయితే, ‘ఇలా కూడా చేస్తారా? స్కూటీపై వార్డు తిరుగుతూ వైద్య సేవలు చేస్తారా’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నర్సుకు ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా రెండు ఇంజిన్లు ఉన్న స్కూటర్ ఇవ్వమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గర్వపడండి.. మీరు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు.. అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.






