- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO VIRAL : పెళ్లి చూపుల్లో అమ్మాయి మేకప్, జుట్టు, రంగు చెకింగ్.. దీంతో అబ్బాయిలో ఆ పార్ట్ చెక్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు
సాధారణంగా ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసుకునేందుకు అబ్బాయి తరపు బంధువులు వచ్చేవారు. మాట, నడక గురించి తెలుసుకునేందుకు.. పాటపాడమని, ఓ సారి నడవమని, కొన్ని పరీక్షలు పెట్టేవారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసుకునేందుకు అబ్బాయి తరపు బంధువులు వచ్చేవారు. మాట, నడక గురించి తెలుసుకునేందుకు.. పాటపాడమని, ఓ సారి నడవమని, కొన్ని పరీక్షలు పెట్టేవారు. ఆ తర్వాత కేఫ్‌లో మీటింగ్.. నచ్చితే పెళ్లి అన్నట్లుగా మారింది. కానీ ఇక్కడే కొందరు పప్పులో కాలేస్తున్నారు మీట్ అయినప్పుడు మేకప్ కారణంగా కొందరు అందంగా కనిపించినా.. పెళ్లి చేసుకున్నాక.. అసలు రంగు బయటపడుతుంది. కానీ ఏం చేస్తారు మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచారు కాబట్టి సర్దుకుపోతున్నారు. అటు అమ్మాయిలు కూడా బట్టతల, లైంగిక ఆరోగ్యం విషయాల్లో మోసపోతున్న ఘటనలు చూశాం.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియోలో ఇలాంటి స్టోరీనే ఆల్మోస్ట్ ఉంది. కానీ కొంచెం డిఫరెంట్.. అందుకే ఈ ప్రస్తావన. అసలు ఏం జరిగిందంటే.. అబ్బాయి, అమ్మాయిని పిలిపించి.. ఇరు కుటుంబాలు లగ్గం చేసుకునే డేట్ ఫిక్స్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి మేకప్ వేసుకుందా లేదా నిజమైన రంగేనా అని ముఖం, ఒళ్లు అంతా తడిమి తడిమి చూశారు. జుట్టు ఒరిజినలా కాదా చెక్ చేశారు. పాపం బిత్తరపోవడం ఆ అమ్మాయి వంతు అయింది. దీంతో చిర్రెత్తిన అమ్మాయి తల్లి.. భర్తను లాక్కుని వెళ్లి అబ్బాయిని చెక్ చేయమని డిమాండ్ చేసింది. దీంతో ఆయన అబ్బాయి షర్ట్ విప్పి, ప్యాంట్ విప్పి చూశాడు. కానీ ఇదంతా నచ్చని అబ్బాయి తరపు బంధువులు గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ చెకింగ్‌లు మాత్రమే కాదు ఫెర్టిలిటీ, లైంగిక సంక్రమణ వ్యాధుల గురించి కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






