- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RB రెస్టారెంట్ పై కేసు నమోదు.. ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు
"బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం, యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం" అనే శీర్షికతో ఆదివారం దిశ పత్రికలో ప్రచురించిన కథనానికి తక్షణ స్పందన వచ్చింది.

దిశ, మెట్‌పల్లి: "బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కలకలం, యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం" అనే శీర్షికతో ఆదివారం దిశ పత్రికలో ప్రచురించిన కథనానికి తక్షణ స్పందన వచ్చింది. దిశ కథనం వెలువడిన మరుసటి రోజే జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని RB రెస్టారంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టణానికి చెందిన కరుణాకర్ కుటుంబంతో కలిసి ఆదివారం ఆర్ బీ రెస్టారెంట్ లో బిర్యానీ తింటుండగా, అతని కుమారుడి ప్లేట్‌లో ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా "ఇది కామనే" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. ఈ కథనం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనూష RB రెస్టారెంట్‌తో పాటు పట్టణంలోని పలు బేకరీలు, హోటళ్లను కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావిడిగా తనిఖీలు చేస్తున్నారే తప్ప, ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిరంతరం ఆహార భద్రత తనిఖీలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






