- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > జమ్మికుంట సప్తగిరి రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
జమ్మికుంట సప్తగిరి రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
by Kodari Anjali |
జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలను లెక్కించి స్టాక్ రిజిస్టర్లతో సరిపోల్చారు. కొనుగోలు, మిల్లింగ్, రవాణా సంబంధిత రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మిల్లింగ్ జరుగుతుందా లేదా, పౌర సరఫరాల శాఖతో జరిగిన ఒప్పందాల అమలుపై ఆరా తీశారు. మిల్లింగ్ చేసిన బియ్యం స్టాక్, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, బ్యాంకు లావాదేవీలు, జీఎస్టీ పత్రాలను అధికారులు సేకరించారు. అనుమానాస్పదంగా ఉన్న కొన్ని పత్రాలను విచారణ నిమిత్తం తమతో తీసుకెళ్లారు.
Next Story






