హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. జహీరాబాద్ వాసి మృతి

by Batti.Sumithra |

హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఆటో బలంగా ఢీ కొట్టడంతో జహీరాబాద్ పట్టణంలోని గడీ వీధికి చెందిన కే. నరసింహులు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. జహీరాబాద్ వాసి మృతి
X

దిశ, జహీరాబాద్ : హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఆటో బలంగా ఢీ కొట్టడంతో జహీరాబాద్ పట్టణంలోని గడీ వీధికి చెందిన కే. నరసింహులు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నరసింహులు కుటుంబంతో కలిసి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. సోమవారం ఉదయం జహీరాబాద్ వచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉండగా, కుమారుడు విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. శిశుమందిర్ పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహులు మృతి చెందిన విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

Next Story