- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా భగ్నం.. 9 బస్తాలు స్వాధీనం
by Kodari Anjali |
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీ ఆటోను సివిల్ సప్లై అధికారి పట్టుకున్నారు

X
దిశ, ధర్మారం: ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ట్రాలీ ఆటోను సివిల్ సప్లై అధికారి మిర్యాల వెంకటరాజు పట్టుకున్నారు. సోమవారం వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం సరఫరా చేసిన 9 బస్తాల పీడీఎస్ బియ్యం (సుమారు 3 క్వింటాళ్లు) ఉన్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని విచారించగా, అతను రాజారాంపల్లి గ్రామానికి చెందిన చింతల రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారి మిర్యాల వెంకటరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతల రాజుపై కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్‌ఐ ఎం. ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Next Story






