వివాహితకు లైంగిక వేధింపులు.. ఆ కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా దేహశుద్ధి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 06:13:57  IST  )

వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది.

వివాహితకు లైంగిక వేధింపులు.. ఆ కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా దేహశుద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కాంగ్రెస్ నేతకు పబ్లిక్‌గా దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకు ప్రధాన అనుచరుడిగా పేరుగాంచిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి, గత నెల రోజులుగా ఓ వివాహిత మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సదరు మహిళ వేధింపులు భరించలేక, విషయాన్ని తన భర్తకు చెప్పింది.

దీంతో భర్త జాగ్రత్తగా ప్లాన్ చేసి గురువారం ఆసుపత్రిలో భార్యను వేధిస్తుండగా దేవేందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధితురాలి భర్త, తన సన్నిహితులతో కలిసి దేవేందర్ రెడ్డిని ఆసుపత్రి నుంచి బయటికి తీసుకొచ్చి నడిరోడ్డుపై చెప్పులతో కొట్టారు. ప్రజలందరూ చూస్తుండగా అతడిని దేహశుద్ధి చేస్తూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో పెద్ద సంచలనం రేపింది. కొంతమంతి రాజకీయ నాయకుల అండదండలతో మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యం అయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దేవేందర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు.

Next Story