- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామిడి చెట్లకు పెళ్లి... అక్కడ వింత ఆచారం
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. ఒక్కసారి పెళ్లి (Marriage) అయితే.. చివర వరకు కలిసిమెలిసి ఉండాలని చెబుతూ

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. ఒక్కసారి పెళ్లి (Marriage) అయితే.. చివర వరకు కలిసిమెలిసి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే ఈ పెళ్లిళ్లు అనేవి మగ, ఆడ ఇష్టపూర్వకంగా చేస్తారు. అయితే తాజాగా రెండు మామిడి చెట్లకు ( Mango Trees)... వింతగా పెళ్లి చేశారు. దీనికోసం ప్రత్యేక పూజలు చేసి... రెండు మామిడి చెట్ల వివాహం ఘనంగా చేశారు.
ఈ సంఘటన జగిత్యాల ( Jagitial ) జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలం తుంగూరు లో కాపుకు వచ్చిన మామిడి చెట్లకు చాలా వైభవంగా వివాహం చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి 8 ఎకరాలలో మామిడి తోట ఉంది. అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి కాత రాలేదు. కానీ తాజాగా మొదటి కాత ఆ మామిడి తోటకు వచ్చింది.
ఇక కాత కాసిన రెండు మామిడి చెట్లకు... యజమానులు పెళ్లి చేశారు. ఈ పెళ్లి సందర్భంగా మామిడి చెట్లకు ప్రత్యేక పూజలు చేసి... భోజనాలు కూడా పెట్టారు. బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( Birpur Sri Lakshmi Narasimha Swamy) ఆలయ అర్చకులు మధు కుమారాచార్యులు ఆధ్వర్యంలో.. ఈ వివాహం జరిగింది. మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి.. జిలకర, బెల్లం పెట్టి మాంగల్య ధారణ చేశారు. ఈ వివాహ వేడుకలో... గ్రామ ప్రజలందరూ అలాగే రైతుల కూడా హాజరయ్యారు. ఇక రెండు మామిడి చెట్లకు ( Mango Trees)... వింతగా పెళ్లి చేసిన సంఘటన వైరల్ గా మారింది.






