- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజే బీట్స్‌తో అదరగొట్టిన మార్కో రూబియో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా దేశాల మధ్య దౌత్య సంబంధాలు, జాతీయ భద్రతా అంశాలతో నిత్యం బిజీగా ఉండే కీలక నేతలు అప్పుడప్పుడు తమలోని మరో కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో (Marco Rubio) కూడా అదే పనిచేశారు. ఓ పెళ్లి వేడుకలో ఆయన ‘డీజే’గా మారి అందరినీ ఉర్రూతలూగించారు. మియామి (Miami)లోని ఓ నైట్‌క్లబ్‌లో తాజాగా ఒక వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన మంత్రి రూబియో, కాసేపు తన అధికారిక హోదాను పక్కనపెట్టి సరదాగా గడిపారు. నేరుగా డీజే కన్సోల్ వద్దకు వెళ్లి, హెడ్‌ఫోన్స్ ధరించి మ్యూజిక్ బీట్స్‌ను ఆపరేట్ చేస్తూ జోష్ నింపారు. మంత్రి స్వయంగా డీజేగా మారి పాటలు ప్లే చేయడంతో అక్కడి అతిథులంతా కేరింతలు కొట్టారు.
నెట్టింట్లో వైరల్ వీడియో..
వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో (Dan Scavino) ఈ అరుదైన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రూబియోలో ఈ మాస్ యాంగిల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.






