- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : షాపింగ్ మాల్స్‌లో ‘హస్బెండ్ స్టోరేజ్’లు..! భార్యతో కలిసి వెళ్తే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చునట!!
Viral : షాపింగ్ మాల్స్‌లో ‘హస్బెండ్ స్టోరేజ్’లు..! భార్యతో కలిసి వెళ్తే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చునట!!

దిశ, ఫీచర్స్ : ‘షాపింగ్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక భార్యతోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో అక్కడికి వెళ్తే సప్త సముద్రాల్ని ఈదినంత రిస్క్ తీసుకోవాల్సిందే!’ అని చమత్కరిస్తుంటారు కొందరు. సాధారణంగానే షాపింగ్ పట్ల మహిళల్లో ఉండే ఇంట్రెస్ట్‌ను తెలియజేసే ఉద్దేశంతో ఇలా చెబుతుంటారు. కారణాలేమైనా పురుషులతో పోలిస్తే షాపింగ్ చేసే విషయంలో మహిళలకు ఓపిక, ఆసక్తి రెండూ ఎక్కువేనని సర్వేలు సైతం పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సరికొత్త షాపింగ్ ట్రెండ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఏంటంటే.. భార్యలు షాపింగ్ చేస్తున్నంత సేపు భర్తలను ఎంటర్టైన్ చేయడానికి చైనా దేశంలోని పలు షాపింగ్ మాల్స్‌లో ‘హస్బెండ్ స్టోరేజ్’ (Husband's storage) లేదా ‘హస్బెండ్ పాడ్స్’ అనే ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దా పదండి!
షాపింగ్ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులు బోర్‌గా ఫీల్ అవుతారని, త్వరగా అలసిపోతుంటారని సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతో తమ భాగస్వామితో షాపింగ్‌కు వెళ్లినప్పటికీ కొనుగోలు పూర్తి కాకముందే తిరిగి వెళ్దామని భర్తలు భార్యలపై ఒత్తిడి తెస్తుంటారు. అయితే దీనివల్ల తమ వ్యాపారానికి నష్టం వాటిల్లుతుందని గుర్తించిన చైనాలోని వ్యాపారస్తులు సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా షాంఘైలోని గ్లోబల్ హెర్బల్ మాల్ (Global Herbal)వంటి కొన్ని షాపింగ్ మాల్స్‌లో ‘హస్బెండ్ స్టోరేజ్’ లేదా ‘హస్బెండ్ పాడ్స్’ అనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
‘హస్బెండ్ స్టోరేజ్’ ఉద్దేశం ఏంటంటే.. భార్యతోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో షాపింగ్‌కు వచ్చిన పురుషులు అలసిపోకుండా, బోర్‌గా ఫీలవకుండా ఈ ప్రత్యేక గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. వీరిని ఎంటర్టైన్ చేయడానికి తగిన సౌకర్యాలు అక్కడ ఉంటాయి. కుర్చీలు, కంప్యూటర్లు, టీవీలు, గేమ్ ప్యాడ్స్, రెట్రో వీడియో గేమ్‌లు, టెక్కెన్ 3, రోబోకాప్ వంటి గేమ్‌లు వంటివి కూడా ఉంటాయి. హస్బెండ్ స్టోరేజ్‌లో ఇష్టం వచ్చినంత సేపు నిద్రించవచ్చు. నచ్చిన స్నాక్స్‌ను ఆర్డర్ చేసి తెప్పించుకొని అక్కడే తినవచ్చు. తమ వెంట వచ్చిన మహిళలు షాపింగ్ పూర్తి చేసేంత వరకు భర్తలు సరదా సరదాగా, ఆనందంగా గడపడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ హస్బిండ్ పాడ్స్‌లో ఉంటాయి. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.






