- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నో ప్రమాదాలు జరగబోతున్నాయ్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన వేణు స్వామి.. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటూ బిగ్ ట్విస్ట్!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామివేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, ఫీచర్స్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పడంతో పాటు పలు పూజలు కూడా జరిపించాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎవరూ నమ్మలేదు. కానీ సమంత(samantha), నాగచైతన్య(Naga Chaitanya) విడిపోతారని చెప్పినప్పటి నుంచి వేణు స్వామి నమ్మడం మొదలెట్టారు. ఇక ఇటీవల నాగచైతన్య, శోభిత(Sobhita Dhulipala) రెండో పెళ్లిపై చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడ్డారు. ఇక తర్వాత నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారు. తాజాగా, ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఆయన ఓ సంచలన వీడియోను రిలీజ్ చేశారు. ‘‘విశ్వావసు నామ సంవత్సరంలో జరిగే సంచలనాల గురించి ఇప్పటికే మీ అందరికీ చెప్పాను.
విమాన ప్రమాదాలు, సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. 2025 సెప్టెంబర్ 1 వరకు సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా సింహ, కన్యా, మకర, మీన వృషభ వారికి సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, తల్లికి అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు వాహన ప్రమాదాలు, భార్యభర్త మధ్య గొడవలు వస్తాయి. ప్రకృతిపరంగా విమాన, అగ్ని, వాహన, ప్రయాణ ప్రమాదాలు, భూకంపాలు, సూనామీ, వంటివి ఎదురవుతాయి. ఎరుపు రంగుకు సంబంధించిన వాహనాలు ఉన్నవారు జాగ్రత్తగా నడపడం మంచిది.
అది కారు, బైక్, విమానం, ట్రైన్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. కేతువుకు సంబంధించిన జపాలు చేయండి. నవగ్రహాలకు పూజించండి, కుజుడు, కేతువులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇలా చేస్తే సమస్య నుంచి బయటపడతారు’’ అని చెప్పుకొచ్చారు. వేణు స్వామి ఈ వీడియోను విడుదల చేయడానికి కారణం ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో పాటు విమానం ఓ మెడికల్ కాలేజీపై పడటంతో అందులో భోజనం చేస్తున్న విద్యార్థులు చనిపోయారు. ఈ సంఘటనపై కోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో వేణు స్వామి ఈ వీడియోను రిలీజ్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






