- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరయ్యా మందు సుక్క లేకపోతే చస్తవా.. తలకాయ ఎక్కడ పెట్టావో తెలుస్తుందా..? (వీడియో)
మద్యం అలవాటు ఉన్న వ్యక్తులు రోజుకు ఒక్క పెగ్గు అయినా వేయకుండా నిద్రపోరు. సుక్క కోసం ఎంతటి సాహసాలైనా చేస్తారు.

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం అలవాటు ఉన్న వ్యక్తులు రోజుకు ఒక్క పెగ్గు అయినా వేయకుండా నిద్రపోరు. సుక్క కోసం ఎంతటి సాహసాలైనా చేస్తారు. అవసరం అయితే యుద్ధానికి అయినా దిగుతారు. రాత్రి ఎంత తాగినా తెల్లారే సరికి వైన్స్‌లు, బెల్ట్ షాపుల ఎదుట క్యూ కడతారు. కరోనా సమయంలో మద్యం దొరక్క అష్టకష్టాలు పడ్డ మందుబాబులు.. వేల రూపాయలు చెల్లించి బ్లాక్‌లో కొనుగోలు చేసి పీక్కుపోతున్న నాలుకను తడుపుకున్నారు. మద్యానికి అలవాటు పడితే వారిని మార్చడం కష్టమే. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది.
ఈ సంఘటన ఎక్కడ జరిగింతో తెలియదు కానీ, వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ వ్యక్తి వైన్ షాప్‌లో క్వాటర్ బాటిల్ తీసుకునేందుకు కౌంటర్‌కు ఎదురుగా ఉన్న ఇనుప గ్రిల్‌లో తలదూర్చాడు. మద్యం బాటిల్ తీసుకున్న తర్వాత తల బయటకు లాగితే ఎంతకూ రాలేదు. దీంతో చుట్టు పక్కన ఉన్న వాళ్లు అతడి తలను బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయినా తల బయటకు రాకపోవడం ఆ వ్యక్తి బిక్క మొఖం వేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇనుప గ్రిల్ సువ్వలను గట్టిగా లాగి పట్టుకోవడంతో అతడు తలను అతికష్టం మీద బయటకు లాక్కున్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ మందుబాటిల్ లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను గ్రిల్‌లో ఇరుక్కోని పడ్డ ఇబ్బందులు చూపరులను నవ్వించాయి. మీరూ ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి..






