Brave Soul: మనుషులనే పట్టించుకోని రోజులివి.. కుక్కకోసం వరదనీటిలో ఆ భయ్యా ఏం చేశాడో తెలుసా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-03 11:41:04  IST  )

మణిపూర్‌లో జరిగిన ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న కుక్కను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించిన వీడియో గుండెలను పిండేస్తోంది.

Brave Soul: మనుషులనే పట్టించుకోని రోజులివి.. కుక్కకోసం వరదనీటిలో ఆ భయ్యా ఏం చేశాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో జరిగిన ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న కుక్కను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించిన వీడియో గుండెలను పిండేస్తోంది.

Xలో @diana_warep అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో.. మైతీ సముదాయానికి చెందిన ఒక వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోతున్న కుక్కను కాపాడేందకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఉద్ధృతంగా ఉన్న వరదనీటి ప్రవాహంలో ఎలాంటి సేఫ్ గార్డ్స్ లేకుండా ఈదుతూ జాగ్రత్తగా కుక్క వద్దకు చేరుకుని, దాన్ని తన చేతుల్లోకి తీసుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారు సంతోషంతో కేరింతలు కొట్టారు. దీనిని ఓ వ్యక్తి వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరలైంది.

"మానవత్వం ఇంకా ఉంది. ధైర్యవంతమైన ఆత్మలు ఉన్నాయి," అని ఆ యూజర్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. "కుక్క ప్రాణాన్ని కాపాడిన వారందరికీ ధన్యవాదాలు." ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో వేలాది మందిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమ వినియోగదారులు ఆ వ్యక్తిని "నిజమైన హీరో"గా, ఇటీవలి అశాంతి, మానవతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో ఆశ, ధైర్యానికి చిహ్నంగా కొనియాడారు.

కాగా.. కుక్కను రక్షించి ఆ వ్యక్తి గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు.. కానీ స్థానిక అధికారులు, జంతు సంక్షేమ సంస్థలు అతని నిస్వార్థ చర్యను గుర్తించాలని చాలామంది కోరుతున్నారు. అశాంతి, సంక్షోభాల నడుమ.. ఈ క్షణం సామాజిక మాధ్యమ వినియోగదారుల హృదయాలను తాకింది. "మనిషి తన బెస్ట్ ఫ్రెండ్‌ను కాపాడాడు."అని ఒక యూజర్,.. "ఆ వ్యక్తి ధైర్యాన్ని, చర్యలను నేను నిజంగా మెచ్చుకుంటున్నాను." అని మరో యూజర్ పేర్కొన్నారు.

Next Story