నా భార్య గర్భవతి ఆస్పత్రికి వెళ్లనివ్వండి.. గవర్నర్ కాన్వాయ్‌కి అడ్డంగా వ్యక్తి నిరసన

by Ajay Maddhiboyina |

నాయకులు ఎవరైనా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతుంటారు. కానీ పదవులు వచ్చిన తరవాత ప్రజాసేవ కంటే ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే ఎక్కువ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్లు బయటకు వెళ్లారంటే మందు నాలుగు వెనక నాలుగు కార్లు ఉండాల్సిందే.

నా భార్య గర్భవతి ఆస్పత్రికి వెళ్లనివ్వండి.. గవర్నర్ కాన్వాయ్‌కి అడ్డంగా వ్యక్తి నిరసన
X

దిశ‌, వెబ్ డెస్క్: నాయకులు ఎవరైనా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతుంటారు. కానీ పదవులు వచ్చిన తరవాత ప్రజాసేవ కంటే ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే ఎక్కువ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్లు బయటకు వెళ్లారంటే మందు నాలుగు వెనక నాలుగు కార్లు ఉండాల్సిందే. ఆ కాన్వాయ్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌జ‌లు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిందే. నాయ‌కుల కాన్వాయ్ ల‌తో ప్రజ‌లు ఎంత ఇబ్బంది పెడ‌తారో తెలిపేలా క‌ర్ణాట‌క‌లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ ప్రయాణించాల్సి ఉండటంతో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేశారు.

ఆ సమయంలో అక్కడ అండర్ పాస్ నిర్మాణపనులు జరగడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే ట్రాఫిక్ లో ఓ వ్యక్తి తన గర్భవతి భార్యను ఆస్పత్రి తీసుకువెళుతూ చిక్కుకుపోయాడు. ఎంత సమయం గడుస్తున్నా పోలీసులు వాహనాలను వదలకపోవడంతో ఆ వక్తి తీవ్ర ఆందోళనకు గురై రోడ్డుపై బైటాయించాడు. మేమేం మనుషులం కాదా.. నా భార్య కారులో పురిటినొప్పితో బాధపడుతోందని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీల భద్రత కంటే సామాన్యుల ప్రాణాలు, అత్యవసర వైద్య అవసరాలు ముఖ్యం కాదా అని పోలీసులను నిలదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. బెంగళూరు లాంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్న మెట్రో నగరాల్లో కాన్వాయ్ ల కోసం రోడ్లు మూసివేయడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా ఇలా ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు.


Next Story