సోదరుడి ఫస్ట్ నైట్ చూడాలని బెడ్‌రూంలో దాక్కున్నాడు.. వైరల్ వీడియో

by Naveena |
సోదరుడి ఫస్ట్ నైట్ చూడాలని బెడ్‌రూంలో దాక్కున్నాడు.. వైరల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా పెళ్లైన దంపతులు ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్తారు. అయితే పెళ్లైన వారందరికి ఈ విషయం తెలిసిందే. కానీ పెళ్లికాని వాళ్ళకి మాత్రం ఓ సందేహంలా మిగిలిపోతుంది. ఈ సందేహాన్ని క్లియర్ చేసుకోవడానికి ఓ యువకుడు కెమెరాలతో ఏకంగా సోదరుడి బెడ్ రూమ్ లోకి దూరిపోయాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి కొడుకు సోదరుడు శోభనం గదిలోకి వెళ్ళి కెమెరాల్లాంటివి పెట్టి .. అటక మీద దాక్కుని రికార్డు చేయాలనుకున్నాడు. అయితే బెడ్ రూమ్ లో ముందుగానే వెళ్లి దాక్కున్నాడు. నవ దంపతులు గదిలోకి వెళ్లిన తర్వాత అసలు ప్రారంభించడానికి ముందే తమను ఎవరో చూస్తున్నారన్న అనుమానానికి వచ్చారు. కాసేపటికి వారికి అటక మీద ఓ వ్యక్తి ఉన్నట్లుగా అర్థమయింది. వెంటనే వారు అతనిని బయటకు రావాలని హెచ్చరించారు. రికార్డు చేయడానికి ముందే వారు కనిపెట్టడంతో..గట్టిగా అరిచారు. దీంతో గమనించిన బంధువులు యువకుడిని పట్టుకొని కొట్టి.. పోలీసులకు అప్పజెప్పారు. ఇలా చేయడంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఫస్ట్ నైట్ రూమ్ లో దాక్కున్న వ్యక్తిని బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అందరూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పిచ్చి వేషాలు వేస్తూండటంతో.. చాలా మంది శోభనం గదిలోనే రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిచ్చి మరింత ముదిరిందనీ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed