- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు మగాడ్రా బుజ్జీ.. కక్కలకే చుక్కలు చూపించాడు
వీధుల్లో కుక్కలు కనిపించాయంటే చాలు ఎవరైనా పరిగెత్తుతారు. కాస్త ధైర్యం ఉన్నవాళ్లు అయితే వాటిని ఎదిరించినట్టు చేస్తూ అక్కడ నుండి జారుకుంటారు. లేదా రాయి తీసుకుని బెదిరించి వెళ్లిపోతారు.

దిశ, వెబ్ డెస్క్: వీధుల్లో కుక్కలు కనిపించాయంటే చాలు ఎవరైనా పరిగెత్తుతారు. కాస్త ధైర్యం ఉన్నవాళ్లు అయితే వాటిని ఎదిరించినట్టు చేస్తూ అక్కడ నుండి జారుకుంటారు. లేదా రాయి తీసుకుని బెదిరించి వెళ్లిపోతారు. అలా చేసేది కూడా ఒకటి రెండు కుక్కలు ఉన్నప్పుడే. కానీ గుంపులు గుంపులుగా కుక్కలు వచ్చాయంటే ఎవరైనా బెదిరిపోవాల్సిందే. అయితే కుక్కలకు దొరక్కుండా పారిపోతారు లేదంటే లబోదిబో అంటూ అక్కడే ఉండి ఎవరైనా వచ్చి సాయం చేస్తారని గట్టిగా అరుస్తారు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తుంటే ఏంటి మమ్మీ ఎవడీడు అనాల్సిందే. వీడియోలో.. చిమ్మచీకట్లో ఒంటరిగా వచ్చిన ఓ వ్యక్తిని కుక్కలు వెంబడించాయి.
అవి కూడా ఒకటి రెండు కాకుండా ఏకంగా ఐదారు కుక్కలు ఒకేసారి వెంబడించాయి. అవి ఒక్కొక్కిటిగా పైకి రావడం మొదలుపెట్టి అతడి పిక్కలు పీకేసే వరకు వచ్చేశాయి. అయినప్పటికీ అతడు ఏ మాత్రం బయపడకుండా తిరిగి వాటి బరతం పట్టడం మొదలు పెట్టాడు. తనను కరిచేందుకు వచ్చిన ఓ కుక్క రెండు కాళ్లను పట్టుకుని చూట్టూ తిప్పుతూ దాంతోనే ఇతర కుక్కలపై దాడి చేశాడు. అతడి దెబ్బకు మిగితా కుక్కలు కూడా దగ్గరకు రావాలంటే బయపడి దూరంగా వెళ్లిపోయాయి. చెవిలో హెడ్ సెట్ పెట్టుకుని ఎలాంటి భయం లేకుండా కుక్కలను అతడు ఎదిరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో వీడు మగాడ్రా బుజ్జీ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






