VIDEO: ఓనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-02 06:32:36  IST  )

ఇటీవ‌లి కాలంలో గుండెపోటు మ‌ర‌ణాలు పెరిగిపోయాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు స‌ర‌దాగా గ‌డిపిన‌వాళ్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు.

VIDEO: ఓనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవ‌లి కాలంలో గుండెపోటు మ‌ర‌ణాలు పెరిగిపోయాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు స‌ర‌దాగా గ‌డిపిన‌వాళ్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు. వాకింగ్ చేస్తూ, జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ కొంద‌రు చ‌నిపోతుంటే మ‌రికొంద‌రు ఏమీ చేయ‌కుండా ఖాళీగా కూర్చుని ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలుతున్నారు.

తాజాగా ఓ వ్య‌క్తి అప్ప‌టి వ‌ర‌కు డ్యాన్స్ చేసి ఒక్క‌సారి కింద‌ప‌డిపోయాడు. కేర‌ళ‌లో ఓనం వేడుక‌ల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓనం సంద‌ర్భంగా కొంత‌మంది స్టేజిపై గ్రూప్ డ్యాన్స్ చేశారు. ఈ క్ర‌మంలో మెయిన్ డ్యాన్సర్ గా చేస్తున్న జునేష్ అబ్దుల్లా 45 కింద‌ప‌డిపోయాడు. సంతోషంగా స్టెప్పులు వేసిన జునేష్ కింద‌ప‌డ‌టంతో ఏం జ‌రిగిందా అని స్నేహితులు ప‌రిశీలించ‌గా గుండెపోటుతో మ‌ర‌ణించాడు. దీంతో అక్క‌డ విషాదం నెల‌కొంది. video

Next Story