బాబోయ్.. ఎలా తింటారు భయ్యా ఈ ఆమ్లెట్.. హార్ట్ అటాక్ వచ్చి పోతారంతే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-11 14:18:40  IST  )

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎటు చూసినా స్ట్రీట్ ఫుడ్డే కనిపిస్తోంది. అవేమైనా హెల్దీగా ఉంటాయా అంటే కాదు.

బాబోయ్.. ఎలా తింటారు భయ్యా ఈ ఆమ్లెట్.. హార్ట్ అటాక్ వచ్చి పోతారంతే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎటు చూసినా స్ట్రీట్ ఫుడ్డే కనిపిస్తోంది. అవేమైనా హెల్దీగా ఉంటాయా అంటే కాదు. వాడు ఏవేవో వెరైటీలు కలిపి వండి అమ్మితే.. జనాలు వెర్రెత్తినట్లు దానికోసం పోటీ పడి మరీ కొనుక్కుని తిని, ఆ తర్వాత ఆస్పత్రుల పాలవుతున్నారు. బయటి ఫుడ్ వద్దు.. ఇంటి ఫుడ్డే ముద్దు అని ఎంత చెప్పినా వినరు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఆమ్లెట్ వేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక్కరోజులోనే ఆ వీడియోను 9.9 మిలియన్ మందికిపైగా చూడగా.. చాలా మంది ఇతర దేశాల్లో ఫుడ్ ఎలా ఉందో పోల్చుతూ మరికొన్ని వీడియో కామెంట్స్ చేశారు. అతను ఆమ్లెట్ వేసిన తీరు చూస్తే.. దానిని తినాలంటేనే ఎవరికైనా రోత పుట్టాల్సిందే. ఆమ్లెట్ అంటే ఇష్టం ఉన్నవారికైతే దానిమీద విరక్తే వస్తుందనడంలో సందేహం లేదు.

పెద్ద బాండీలో నూనె కాగుతూ ఉండగా.. దానిపై ఒక పక్కన గుడ్డును పగల గొట్టి.. దానిని చేతితోనే రుద్ది నల్లగా ఉన్న నూనెలో వేసి రోస్ట్ చేస్తాడు. దానిని బయటికి తీసి అదే చేతితో పసపస నలిపేసి.. పక్కన ఉన్నది రెడ్ మీట్ అనుకుంటా.. దానితో కలిపి మళ్లీ ఆ మడ్డి ఆయిల్ లోనే వేయించాడు. ఈ ఫుడ్డు తిన్నోడు ఎవడికైనా హార్ట్ అటాక్ రావడం ఖాయం అనడంలో ఏం సందేహం లేదు కదా. దీనిపై ఒక యూజర్.. ఇంజిన్ ఆయిల్ ను డీప్ ఫ్రై కు వాడుతున్నారని కామెంట్ చేశాడు. ఆ ఆయిల్ అంత నల్లగా ఉంది మరి. పైగా ఫ్రై చేస్తే.. అందులో నుంచి సర్ఫ్ ఎక్సెల్ నుంచి వచ్చినంత నురగ వస్తుంది. ఇలాంటి ఫుడ్ తినడం కంటే పస్తులుండటం బెటర్ బ్రదర్. ఏమంటారు?

Next Story