- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: పండుగల ఎఫెక్ట్.. రైలు బాత్రూమ్‌నే బెడ్రూమ్‌గా మార్చుకున్నాడు
ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీతో రైళ్లు కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. రైళ్లలో కూర్చునే స్థలం లేక నిలబడటం, కొందరు కింద కూర్చోవడం లాంటివి చేస్తూ సొంతూళ్లకు పయనం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికులు ట్రైన్ టాయిలెట్‌ను బెడ్ రూమ్‌గా మార్చుకుని దర్జాగా కూర్చుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీతో రైళ్లు కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. రైళ్లలో కూర్చునే స్థలం లేక నిలబడటం, కొందరు కింద కూర్చోవడం లాంటివి చేస్తూ సొంతూళ్లకు పయనం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికులు ట్రైన్ టాయిలెట్‌ను బెడ్ రూమ్‌గా మార్చుకుని దర్జాగా కూర్చుకున్నాడు. అది కాస్తా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ కంట పడటంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విశాల్ శర్మ అనే వ్లాగర్ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే వీడియోకు 1.2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ కూడా వచ్చాయి. వ్లాగర్ చూపించిన వీడియోలోని వ్యక్తి బాత్రూమ్ మొత్తాన్ని పూర్తిగా ఆక్రమించాడు. కింద తన వద్ద ఉన్న బ్యాగులు ఇతర వస్తువులను వేసి వాటిపై కూర్చున్నాడు. టాయిలెట్ వెళ్లేందుకు అసలు వీలు లేకుండా పూర్తిగా తలుపును మూసి వేసి దర్జాగా కూర్చున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఇండియా నాట్ ఫర్ బిగినర్స్, దేశం అభివృద్ధి చెందుతోంది. అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు బాత్రూమ్ లాక్ చేసుకుంటే ఎవరికైనా అర్జంట్ వస్తే ఎలా వెళతారంటూ మండిపడుతున్నారు. video






