- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలిపై యువకుడి దాడి..షాకింగ్ వీడియో వైరల్
ప్రియురాలిపై యువకుడి దాడి చేసిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై రోజు రోజుకు దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక మూలన, మహిళలపై లైంగిక దాడులు, లేదా ఇతర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకువచ్చినా, మహిళలపై దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా మహారాష్ట్రలోని పూణేలో ఓ అమానవీయ సంఘటన తెరపైకి వచ్చింది. ఈ నెల 27వ తేదీన ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న ప్రియురాలిపై.. ఆమె ప్రియుడు దారుణంగా దాడి చేశాడు.
దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆమెను చితకబాదాడు. గొంతు పట్టుకొని, పిడుగుద్దులు కురిపిస్తూ రెచ్చి పోయాడు. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆ దుకాణపు యజమాని లేనట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపైన పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రియుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






