మనిషివా.. మృగానివా !.. ఐదేళ్ల బాలుడిపై అమానుష ఘటన.. వీడియో వైరల్

by Ramesh Naini |

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదేళ్ల బాలుడిపై జరిగిన అమానుష దాడి తీవ్ర కలకలం రేపింది.

మనిషివా.. మృగానివా !.. ఐదేళ్ల బాలుడిపై అమానుష ఘటన.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదేళ్ల బాలుడిపై జరిగిన అమానుష దాడి తీవ్ర కలకలం రేపింది. థ్యాగరాజనగర్ ప్రాంతంలోని పోస్టల్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు తల్లి, బంధువులతో కలిసి ఆడుకుంటున్న నీవ్ జైన్‌ (5)పై రంజన్‌ (35) అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఎలాంటి కారణం లేకుండా కాలితో బలంగా తన్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు అకస్మాత్తుగా బయటకు వచ్చి బాలుడిని తన్నడం స్పష్టంగా కనిపించింది. ఈ దాడి కారణంగా బాలుడు రోడ్డుపై బలంగా కింద పడిపోయి ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై బాలుడి తల్లి దీపికా జైన్‌ బనశంకరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు. రంజన్‌ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడిని జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ బాలుడిపై ఆ వ్యక్తి దాడికి దిగినట్లు మరో సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్ అవుతోంది. ఘటనపై నెటిజన్‌లు తీవ్ర స్థాయిలో స్పందించారు. పిల్లల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు. నువ్వు మనిషివా.. మృగానివా..? చిన్న పిల్లవాడిని ఎలా తన్నాలనిపించిందని మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. వీడియో ఇదే..

Next Story