భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి.. డ్యాన్స్ చేస్తూ పోలీసుల సంబురాలు (వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 02:29:41  IST  )

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి.. డ్యాన్స్ చేస్తూ పోలీసుల సంబురాలు (వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. సైలెంట్ ఓటింగ్‌తో టీఎంసీ (TMCP)ని గద్దె దింపుతూ ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఇక మమతా బెనర్జీ తాను ఓనమాలు నేర్చిన భవానీ‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్లతో తేడాతో ఓటమి చవిచూసింది. అయితే, రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఘనవిజయంతో ఉత్సాహంలో ఉన్న పశ్చిమ బెంగాల్ పోలీస్ సిబ్బంది, ఏకంగా ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ యంత్రాంగంపై మమతా బెనర్జీకి ఉన్న పట్టు పూర్తిగా సడలిందని, పోలీసులే నేరుగా ప్రతిపక్ష పార్టీ విజయానికి మద్దతు తెలపడం ఓ చారిత్రాత్మక మార్పు అని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

Next Story