- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి కోడలు(వీడియో)
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చాలా పాపులర్. తన జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఏకంగా ఓ పాటే పుట్టుకొచ్చింది. ఫుల్లుగా వైరల్ అయిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చాలా పాపులర్. తన జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఏకంగా ఓ పాటే పుట్టుకొచ్చింది. ఫుల్లుగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ మస్త్ వ్యూస్ సంపాదించుడే.. ఆయన చెప్పిన మాటలు వైరల్ అయిపోవుడే జరిగింది. అయితే వెరైటీగా ఈసారి ఆయన కోడలు వైరల్ అయింది. సోషల్ మీడియాలో మస్త్ ట్రెండ్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన ఆమె డాక్టర్ కాగా మల్లారెడ్డి కొడుకును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మల్లారెడ్డి ఇనిస్టిట్యూషన్స్ చూసుకుంటుంది. ఈ క్రమంలో కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ప్రీతి.. స్టూడెంట్స్‌తో కలిసి స్టెప్పులేసింది. విక్కీ కౌశల్ పాపులర్ సాంగ్ ‘తోబా’కు డ్యాన్స్ ఇరగదీసింది. దీంతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ‘డాక్టర్ కాదు డ్యాన్సర్’, ‘ఇంత టాలెంట్ ఎక్కడ దాచావు అక్క’, ‘ మీరు నిజంగా సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






