- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: కుంభమేళా మోనాలిసా ఇంతలా మారిపోయిందా.. చూస్తే మతిపోవాల్సిందే!
మహాకుంభమేళాలో కనిపించిన పూసలు అమ్ముకునే ఓ యువతి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెటింట తెగ వైరల్ అవ్వడంతో యూట్యూబ్ ఛానళ్లు ఆమె వెంట పరిగెత్తి మరీ వీడియోలు తీశాయి. అంతేకాకుండా ఇంత అందం ఎప్పుడూ చూడలేదు అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా

దిశ, వెబ్ డెస్క్: మహాకుంభమేళాలో కనిపించిన పూసలు అమ్ముకునే ఓ యువతి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు నెటింట తెగ వైరల్ అవ్వడంతో యూట్యూబ్ ఛానళ్లు ఆమె వెంట పరిగెత్తి మరీ వీడియోలు తీశాయి. అంతేకాకుండా ఇంత అందం ఎప్పుడూ చూడలేదు అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఆమెపైనే ఫోకస్ చేస్తూ స్టోరీలు ప్రసారం చేసింది. దీంతో సాధారణ పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా అని పేరు సంపాదించుకుంది.
ఆ తరవాత మోనాలిసా సొంత ఛానల్ పెట్టి యూట్యూబ్ వీడియోలు చేయడం, సినిమా ఆఫర్లు రావడం కూడా జరిగింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెతో వీడియో సాంగ్ సైతం చేశారు. ఇక చాలా కాలంగా మోనాలిసా పెద్దగా వార్తల్లో కనిపించడంలేదు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మోనాలిసా పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది.
కట్టు బొట్టుతో పాటూ అన్నీ మార్చేసినట్టు కనిపిస్తుంది. ఓ మోడల్, హీరోయిన్ మాదిరిగా పొట్టిబట్టలు వేసుకుని ఓ పాటుకు స్టెప్పులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే చాలా మంది ఈ వీడియోను నిజమైన వీడియో అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐ వాడకం పెరగటంతో చాలా మంది హీరోయిన్ల మార్ఫింగ్ వీడియోలు చేసినట్టే మోనాలిసా వీడియోను కూడా మార్ఫింగ్ చేశారని తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతూ కామెంట్లు పెడుతున్నారు. video






