అదృష్టం అంటే నీదే గురూ..! రూ.6 లాటరీ టికెట్ జీవితాన్ని మార్చేసింది

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-17 02:52:11  IST  )

భగవంతుడు కరుణిస్తే బికారి కూడా ఒక్కరోజులో కోటీశర్వుడు అవుతాడనే నానుడి నిజమైంది.

అదృష్టం అంటే నీదే గురూ..! రూ.6 లాటరీ టికెట్ జీవితాన్ని మార్చేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: భగవంతుడు కరుణిస్తే బికారి కూడా ఒక్కరోజులో కోటీశర్వుడు అవుతాడనే నానుడి నిజమైంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని జీరా (Jeera) ప్రాంతానికి చెందిన జస్మెల్ సింగ్ (Jamel Singh) దంపతులు కూలి పనుల చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జస్మెల్‌కు చిన్నప్పటి నుంచి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎన్నడైనా తనకు పెద్ద మొత్తంలో లాటరీ తగలకపోతుందా.. కోటీశ్వరుడిని కాకపోతానా అని కలలు కంటుండేవాడు. అయితే, ఇటీవలే కూలి పని కోసం జీరా పట్టణానికి వెళ్లిన అతడు లాటరీ టికెట్లు అమ్మే షాపుకు వెళ్లాడు. అక్కడ రూ.6 పెట్టి నాగాలాండ్ (Nagaland) లాటరీ టికెట్ విక్రయించాడు. సరిగ్గా నెల రోజులు గడిచాక లాటరీ టికెట్లు అమ్మే షాపు యజమాని గుల్షన్ శర్మ (Gulshan Sharma) నుంచి జస్మెల్ సింగ్‌కు ఫోన్ వచ్చింది. రూ. కోటి లాటరీ తగిలిందని చెప్పగా.. మొదట జస్మెల్ ఎవరో తనతో జోక్ చేస్తున్నారని ఫోన్ పెట్టేశాడు. అయితే, షాపు యజమాని గుల్షన్ శర్మ, జస్మెల్ సింగ్‌ను జీరా పట్టణానికి పిలిపించి విషయం చెప్పగా.. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని ఎరిగి గంతేశాడు. అనంతరం జస్మెల్ శర్మ మాట్లాడుతూ.. తనకు వివాహం అయిందని, అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నానని తెలిపాడు. వచ్చిన లాటరీ డబ్బుతో అప్పులన్నీ తీర్చి సంతోషంగా జీవితాన్ని గడుపుతామని జస్మెల్ సింగ్ అన్నాడు.

Next Story