మంచు కొండల్లో యజమాని మృతి.. నాలుగు రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం

by Naga Rani Yarlagadda |

నరాలు బిగుసుకుపోయే చలిలో యజమాని మరణిస్తే.. అతని పెంపుడు శునకం నాలుగు రోజులు ఆహారం, నీళ్లు లేకుండా కాపలా కాసింది.

మంచు కొండల్లో యజమాని మృతి.. నాలుగు రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం
X

దిశ, వెబ్‌డెస్క్: నరాలు బిగుసుకుపోయే చలిలో యజమాని మరణిస్తే.. అతని పెంపుడు శునకం నాలుగు రోజులు ఆహారం, నీళ్లు లేకుండా కాపలా కాసింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని భార్మౌర్లో వెలుగుచూసింది. కొద్దిరోజులుగా అక్కడ భారీ హిమపాతం నమోదవుతోంది. కొండ ప్రాంతాల్లో ఉండే జనం దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనిమీద ఓ వ్యక్తి తన పెంపుడు శునకాన్ని వెంటబెట్టుకుని బయటికి వెళ్లాడు. కానీ.. చలిని తట్టుకోలేక మధ్యలోనే మృతి చెందాడు. కానీ ఆ శునకం మాత్రం తన యజమాని మృతదేహం వద్ద కాపలాగా ఉంది. ఒకటిరెండ్రోజులు కాదు. నాలుగు రోజులపాటు తిండి లేకుండా, అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో చలికి గజ గజ వణుకుతూ అలాగే కాపలా కాసింది. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందిని కూడా కొద్దిసేపు దగ్గరకు కూడా రానివ్వలేదు.

తన యజమాని పట్ల పిట్ బుల్ కు ఉన్న ప్రేమ, విశ్వాసాన్ని చూసి.. రెస్క్యూ సిబ్బంది, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెస్క్యూ టీమ్ ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.

Next Story