- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL VIDEO: అది మెట్రో అనుకున్నారా.. ఓయో అనుకున్నారా.. ఇంత కరువులో ఉన్నారేంట్రా?
దేశంలో యువత రోజురోజుకు విలువలు మర్చిపోతున్నారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. ప్రైవేట్‌గా నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను పబ్లిక్‌గానే చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో యువత రోజురోజుకు విలువలు మర్చిపోతున్నారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. ప్రైవేట్‌గా నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను పబ్లిక్‌గానే చేస్తున్నారు. దాన్నే ట్రెండ్‌లా ఫీల్ అవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఎంతో మంది ప్రయాణించే మెట్రోలో ఓ జంట రెచ్చిపోయింది. చుట్టూ జనాలు ఉన్నా వారిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో అది కూడా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పక్కపక్కన కూర్చున్న యవతీయువకులు పక్కన వారిని పట్టించుకోకుండా ఘాటు రొమాన్స్ లో మునిగిపోయారు. వాళ్ల రొమాన్స్ చూసీ చూడనట్టుగా ఉంటూ పక్కన వ్యక్తి ఇబ్బందిపడుతున్నా వాళ్లు మాత్రం లోకాన్నే మర్చిపోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డ్ చేసి ఎక్స్‌లో పెట్టడంతో వైరల్ అవుతోంది.
ఆ వీడియోకు మినీ పార్కుల్లా మారిపోతున్న మెట్రోలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతే కాకుండా ఇదేం జన్ జెడ్ జనరేషన్..వీళ్లను ఇంత కాన్ఫిడెంట్ గా పెంచిన తల్లిదండ్రులకు చప్పట్లు.. అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. అయితే మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రో, బెంగుళూరు మెట్రో చివరికి హైదరాబాద్ మెట్రోలోనూ ఇటాంటివి చోటు చేసుకున్నాయి. కొంతమందిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ రిపీట్ అవుతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.






