VIDEO: హైదరాబాద్ రోడ్లపై హద్దులు దాటిన ప్రేమజంట.. ఆటోలోనే రొమాన్స్

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్ రోడ్ల‌పై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఇది వ‌ర‌కు బైక్‌ల‌పై వెళుతూనే రొమాన్స్ చేసుకున్న జంటలు ఇప్పుడు ఆటోల‌ను సైతం వాడుకుంటున్నాయి. తాజాగా పాత‌బ‌స్తీలో యువ‌తిని ముందు కూర్చోబెట్టుకుని డ్రైవ‌ర్ ఆటో న‌డుపుతూ కెమెరాకు చిక్కాడు. ఖాళీగా కూర్చోకుండా స‌ర‌సాల్లో మునిపోయాడు.

VIDEO: హైదరాబాద్ రోడ్లపై హద్దులు దాటిన ప్రేమజంట.. ఆటోలోనే రొమాన్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ రోడ్ల‌పై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఇది వ‌ర‌కు బైక్‌ల‌పై వెళుతూనే రొమాన్స్ చేసుకున్న జంటలు ఇప్పుడు ఆటోల‌ను సైతం వాడుకుంటున్నాయి. తాజాగా పాత‌బ‌స్తీలో యువ‌తిని ముందు కూర్చోబెట్టుకుని డ్రైవ‌ర్ ఆటో న‌డుపుతూ కెమెరాకు చిక్కాడు. ఖాళీగా కూర్చోకుండా స‌ర‌సాల్లో మునిపోయాడు. దీనిని ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. వీడియోలో డ్రైవర్ తన ప్రియురాలిని పక్కనే కూర్చోబెట్టుకుని రోడ్డు చూడకుండా ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు.

దీంతో వారిని ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటోళ్ల వ‌ల్లే రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆటోలో వెనుక క‌స్ట‌మ‌ర్ ఉన్నాడ‌ని కూడా ప‌ట్టించుకోకుండా ప్రేమ‌జంట హ‌ద్దులు దాట‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక గతంలోనూ కొంతమంది బైకులపై రొమాన్స్ చేసుకున్న వీడియోలు వైరల్ అవ్వగా బండి నంబర్ ఆధారంగా వారిపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. VIDEO

Next Story