ప్రేమను నిరాకరించిందని.. ప్రియురాలి ఇంటిపై బాంబ్ వేసిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇక్కడే జరిగింది..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-31 11:33:15  IST  )

ప్రేమ... అదో మధురానుభూతి. కానీ ఇప్పుడు అలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆస్వాదనలు ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయాయి. లవ్ అంటే టైమ్ పాస్ అయిపోయింది.

ప్రేమను నిరాకరించిందని.. ప్రియురాలి ఇంటిపై బాంబ్ వేసిన ప్రియుడు..  అసలు ట్విస్ట్ ఇక్కడే జరిగింది..
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ... అదో మధురానుభూతి. కానీ ఇప్పుడు అలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆస్వాదనలు ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయాయి. లవ్ అంటే టైమ్ పాస్ అయిపోయింది. ఎక్కడో ఒక్క చోట సిన్సియర్ లవ్ స్టోరీ కనిపిస్తుంది తప్పితే అంతా ఫేక్ స్టోరీసే. పైగా జలస్‌తో నిండిపోతున్నాయి. రివేంజ్ నెక్స్ట్ స్టెప్ అంటున్నాయి. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రేమను తిరస్కరించిన ప్రియురాలి ఇంటిపై బాంబ్ దాడి చేసిన ప్రియుడి కథ హెడ్ లైన్స్ టచ్ చేసింది.

థాయిలాండ్‌లో ఒక వ్యక్తి.. తన ప్రేమికురాలు బ్రేకప్ చెప్పడంతో చాలా హర్ట్ అయ్యాడు. ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. రివేంజ్ తీసుకునే క్రమంలో ఆమె ఇంటిపై గ్రెనేడ్ విసిరాడు. అది పేలడంతో మరణించాడు. ఈ సంఘటన మే 25, 2025న దక్షిణ థాయిలాండ్‌లోని సూరత్ థానీలో జరిగింది. 36 ఏళ్ల సురపాంగ్ థాంగ్‌నాక్ తన మాజీ భాగస్వామి కనోన్‌రఫత్ సావోఖోన్ తనతో ఉండేందుకు నిరాకరించడంతో కోపంతో ఆమె ఇంటిపై బాంబ్ విసిరాడు. అయితే ఆ గ్రెనేడ్ ఒక స్తంభాన్ని తాకి.. తిరిగి వచ్చి పేలింది. అతన్నే చంపింది. గ్రెనేడ్ విసిరినప్పుడు అమ్మాయి కుటుంబం అక్కడి నుంచి పారిపోగా.. అదృష్టవశాత్తూ ఎవరికీ హాని జరగలేదు. పోలీసులు ఈ సంఘటనను ధృవీకరించగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Next Story