- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూడిదవుతున్న లాస్ ఏంజిల్స్ నగరం.. చెక్కుచెదరని చర్చి.. నిజమేంటంటే?
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజిల్స్ అడవుల్లో ఈనెల 7న చెలరేగిన కార్చిచ్చు నేటీకి చల్లారలేదు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజిల్స్(Los angels) అడవుల్లో ఈనెల 7న చెలరేగిన కార్చిచ్చు నేటీకి చల్లారలేదు. మరింత వేగంతో లాస్ ఏంజిల్స్ నగరాన్ని కాల్చి బూడిదచేస్తుంది. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ అగ్ని ప్రమాదంలో అమెరికా ఇంతగా నష్టపోలేదు. అయితే, ఈ ఘటనలో ఆసక్తికర విషయం ఏమిటంటే? కార్చిచ్చు లాస్ ఏంజిల్స్‌లోని అడవులు, వాటి మధ్య ఉన్న గ్రామాలు, పెద్ద పెద్ద భవనాలు బూడిదయిన ఓ చర్చికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని, నిశ్చలంగా చెక్కుచెదరకుండా ఉందని నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతుంది. అసలు నిజంగానే ఆ చర్చికి ఏం జరగలేదా? ఆ పెద్ద కార్చిచ్చు సైతం ఆ చర్చిని ఏం చేయలేకపోయిందా?
వాస్తవానికి, నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో నిజమైంది కాదు. ఈ విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ చేస్తున్న ఫొటో.. ఏఐ ద్వారా తయారు చేసినట్టుగా గుర్తించింది. ఆ ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నాలజీని ఉపయోగించుకుని గూగుల్‌లో సెర్చ్ చేయగా.. లాస్ ఏంజిల్స్ నగరానికి చెందినట్టుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అంతేకాదు, అగ్నిప్రమాదంలో చర్చి మాత్రమే కాలిపోకుండా ఉందని చూపించే కథనాలు కూడా ఏమీ దొరకలేదు.
అలాగే ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్ అస్పష్టంగా ఉండటంతో ఫేక్ ఇమేజ్ డిటెక్టర్(Fake Image Detector)తో పరిశీలించగా ఎడిట్ చేసిన ఫొటో అని తేలింది. తదితర ఆధారాలతో ఫ్యాక్ట్ చెక్ నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోను ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని నిజం తెలుసుకుండా నమ్మకూడదని తెలిపింది.






