- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ ఛీ.. డాక్టర్ అయి ఉండి ఎలాంటి పని చేశాడో చూడండి!
వైద్యో నారాయణ హరి అంటారు.

దిశ, వెబ్ డెస్క్: వైద్యో నారాయణ హరి అంటారు. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. అలాగే, ప్రజల ఆరోగ్యం కోసం వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని నిత్యం సూచిస్తుంటారు. అలాంటి గొప్ప వైద్య వృత్థికే కళంకం తీసుకువచ్చాడు ఓ డాక్టర్. సిగరేట్, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన వైద్యుడే చిన్న పిల్లాడికి దగ్గరుండి మరీ సిగరెట్ తాగడం నేర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ఆ డాక్టర్‌పై మండిపడుతున్నారు. వెంటనే ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
యూపీలోని (Uttarpradesh) జాలౌన్ జిల్లా కుఠౌంద్ PHC డాక్టర్ సురేశ్‌చంద్ర ఐదేళ్ల చిన్నారికి దగ్గరుండి సిగరెట్ తాగటం నేర్పించాడు. చిన్నారి నోట్లో సిగరెట్ పెట్టి స్వయంగా తానే వెలిగించడమే కాకుండా 'పీల్చు.. పీల్చు' అంటూ ప్రోత్సహించాడు. అంతేకాదు, వీడియో చివరలో 'బాస్! ఈరోజుకు ఈ శిక్షణ చాలు. రేపు రా.. మళ్లీ నేర్పుతా' అంటున్న డాక్టర్ గొంతు కూడా అందులో రికార్డయింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవ్వటంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఉన్నతాధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. ఆ బాబు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు కుమారుడిగా గుర్తించారు. ఆ బాలుడికి జలుబుకు చికిత్సగా వైద్యుడు ఈ పని చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలను డాక్టర్ సురేశ్‌చంద్ర ఖండించాడు. అది చాక్లెట్ సిగరెట్ అని, సిబ్బంది వీడియోను తప్పుగా వైరల్‌గా చేశారని తెలిపాడు.
जालौन प्राथमिक स्वास्थ केंद्र कुठौंद में इलाज कराने आए दंपत्ति के नौनिहाल बच्चे को डॉ सुरेशचंद्र सिगरेट पीने की ट्रेनिंग दे रहे, एक जिम्मेदार डॉक्टर बच्चे के स्वास्थ और भविष्य के साथ कर रहा खिलवाड़ स्थानीय लोगों ने वीडियो बनाकर सोशल मीडिया पर किया वायरल।@brajeshpathakup pic.twitter.com/QetkSbqF6x
— Mohammad Imran (@ImranTG1) April 16, 2025






