ఫోన్ పిచ్చిలో లోకో పైలట్ నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రైలు ఎలా వెళ్లిందంటే (వీడియో)

by Disha Web Desk 7 |
ఫోన్ పిచ్చిలో లోకో పైలట్ నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రైలు ఎలా వెళ్లిందంటే (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. దీంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి. ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంతగా ఫోన్‌లో నిమగ్నమైపోతున్నారు. ఇదే విధంగా ప్రవర్తించింది ఓ మహిళ పైలట్. బాధ్యత గల లోకో పైలట్ ప్లేస్‌లో ఉండి ఫోన్ పిచ్చిలో పడి మరో రైలును ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రష్యాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ మహిళా లోకో పైలట్ ఓ పక్క రైలు నడుపుతూనే.. మరో వైపు ఫోన్ చూసుకుంటుంది. దీంతో ఎదురుగా ఏం ఉందో చూసుకోకుండా మరో రైలు ఢీ కొట్టింది. దీంతో రైల్లో ఉన్న కొంత మంది ప్రయాణికులు ఆ కుదుపుకు కింద పడ్డారు. అయితే రైల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 2019 అక్టోబర్ రష్యాలో జరిగింది.

Next Story

Most Viewed