Viral: వందేభారత్ రైలు కింద పడిన ఆవు.. రక్షించిన లోకోపైలెట్.. (వీడియో వైరల్)

by Indraja |   (  Updated:2024-05-20 10:49:36  IST  )

రైలు వస్తున్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

Viral: వందేభారత్ రైలు కింద పడిన ఆవు.. రక్షించిన లోకోపైలెట్.. (వీడియో వైరల్)
X

దిశ వెబ్ డెస్క్: రైలు వస్తున్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వేగంగా వస్తున్న రైలుకి ఏది అడ్డంగా వచ్చిన ఆగకుండా వెళ్లిపోతుంది. ఒకవేళ షడన్‌గా ఆపాలని ప్రయత్నించినా ఆగదు, గమ్యస్థానానికి దూరం నుండే రైలు వేగంగాన్ని తగ్గిస్తూ రావాలి. అప్పుడే అది ఆడుతుంది. షడన్ బ్రేక్ వేసినా కొంచం దూరం వెళ్ళి ఆగుతుంది.

అందుకే గతంలో రైలును ఢీ కొని పశువులు మరణించిన ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా అతి వేంగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఢీకొన్ని ఇప్పటివరకు చాలా పశువులు మృత్యువాత పడ్డాయి. ఇలాంటి ఘటనే తాజాగా జరింగింది. అయితే ఈ ఘటనలో అ ఆవు సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ట్రాక్‌పై ఒక ఆవు పడుకుని ఉంది.

ఆ సమయంలో అదే ట్రాక్‌పై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్న లోకోపైలెట్ దూరం నుండే ట్రాక్‌పై పడుకుని ఉన్న ఆవును గమనించారు. మానవతాదృక్పదంతో లోకోపైలెట్ ఆ మూగ జీవి ప్రాణాలను కాపాడాలి అని అనుకున్నారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. సమయస్పూర్తితో లోకోపైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం, ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో రైలు ఆవు దగ్గరకి వచ్చి ఆగింది.

అయితే ఆవు వెనక భాగం రైలు ఇంజిన్‌ ముందు భాగంలో ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో లోకో పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి రైలును వెనక్కి కదిలించాడు. దాంతో ఆవు తనంతట తానుగా లేచి సురక్షితంగా ట్రాక్ దాటి వెళ్ళిపోయింది. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click Here For Twitter Post..

Next Story