- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News : ఇదెక్కడి కథరా అయ్యా.. దినాలకు మందు పొయ్యలేదని గొడవకు దిగిన గ్రామస్తులు.. ఏకంగా కుటుంబాన్నే వెలేశారుగా!
మనిషి పుట్టడాన్నే కాదు చనిపోవడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే ఆచారాలున్నాయి. మరణించిన రోజు దు:ఖంలో ఉన్నా.. ఆ తర్వాతి రోజుల్లో సుక్క, ముక్క కామన్. పదకొండు రోజుల వరకు

దిశ, ఫీచర్స్: మనిషి పుట్టడాన్నే కాదు చనిపోవడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే ఆచారాలున్నాయి. మరణించిన రోజు దు:ఖంలో ఉన్నా.. ఆ తర్వాతి రోజుల్లో సుక్క, ముక్క కామన్. పదకొండు రోజుల వరకు బంధువులు కడుపు సల్ల పేరుతో చికెన్, మటన్, మందు పెడితే.. పెద్ద దినకర్మ రోజున చనిపోయిన వ్యక్తికి చెందిన కుటుంబం ఈ పని చేయాలి. గ్రామస్తులు, చుట్టాలను అందరినీ పిలిచి వాళ్లు సంతృప్తి చెందే వరకు వడ్డించాలి. లేదంటే మాటొచ్చేస్తదనే భయం ఉంటది. తెలంగాణలోనే కాదు ఒడిశాలోనూ ఈ సంప్రదాయం ఉంది. ముఖ్యంగా గిరిజన తెగల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ గిరిజన తండాకు చెందిన ఓ వృద్ధుడు ఈ మధ్యే మరణించాడు. గ్రామస్తులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన కొడుకు దశ దినకర్మ రోజు మందు(హండియా.. ట్రెడిషనల్ రైస్ బీర్) పోయించలేదని.. ఊరోళ్లంతా ఏకమై గొడవకు దిగారు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి చనిపోయిన వ్యక్తికి చెందిన కుటుంబాన్ని వెలేశారు. భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలకు తాగేందుకు నీరు, వంట చేసుకునేందుకు కూరగాయాలు, కిరాణా సామాను ఇవ్వకుండా దూరం పెట్టేశారు. దీంతో ఆకలితో అలమంటిని వారు.. ఏం చేయాలో తెలియక పోలీసులను కలిశారు. ఇందుకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ కాలంలోనూ ఇలా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.






