- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : అది సింహం అనుకున్నావా..? మేక పిల్ల అనుకున్నావా బాబూ..? వైరల్ వీడియో
సాధారణంగా క్రూరమృగాలు అంటే అందరికీ విపరీతమైన భయం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా క్రూరమృగాలు అంటే అందరికీ విపరీతమైన భయం ఉంటుంది. అందులోనూ పులి, సింహం అయితే.. వాటి పేరు వింటేనే హాడల్ ఉంటుంది. వాటిని దూరం నుంచి చూస్తే ఎవ్వరైనా కాళ్ళకు బుద్ధి చెప్పి, పరుగు అందుకోవాల్సిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం సింహాన్ని(Lion).. పెరట్లొకి అనుకోకుండా వచ్చిన మేకపిల్లలా చిన్న కర్రతో తరిమేశాడు. ఈ సంఘటన గుజరాత్(Gujarath)లోని భావ్నగర్(Bhav Nagar) రైల్వే డివిజన్ పరిధిలో జరగగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గుజరాత్ లో సింహాల 'గిర్ జాతీయ పార్కు'(Ghir National Park) ఉంది. అక్కడ సింహాల సంఖ్య కూడా ఎక్కువే. రాత్రుళ్లు ఊర్ల మీద పడి స్వేచ్ఛగా విహరిస్తాయి. అక్కడి ప్రజలు వాటి బారిన పడకుండా కాస్త జాగ్రత్తగానే ఉంటారు. అయితే భావ్ నగర్ డివిజన్ పరిధిలో ఓ సింహం రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైల్వే గార్డ్ దానిని చిన్న కర్రతో అదిలించి తరిమేశాడు. ఆ సింహం కూడా అక్కడి నుంచి పరుగుఅందుకోవడం విశేషం. కాగా అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్స్ 'ఓ మై గాడ్' అంటూ షాక్ అవుతున్నారు.






