- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా కన్నా అద్భుతమైన జీవితం.. భారత్‌పై అమెరికన్ మహిళ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల పర్యాటకులు నిత్యం భారత్‌ను సందర్శిస్తూ ఉంటారు. అయితే, కొందరికి ఇది కేవలం పర్యటనగా మొదలై, జీవితాంతపు ప్రేమగా మారుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల పర్యాటకులు నిత్యం భారత్‌ను (India) సందర్శిస్తూ ఉంటారు. అయితే, కొందరికి ఇది కేవలం పర్యటనగా మొదలై, జీవితాంతపు ప్రేమగా మారుతుంది. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతిక విలువలు, జీవనశైలి.. ఇవన్నీ విదేశీయుల మనసులను కట్టి పడేస్తుంటాయి. భారత జీవనంలో కనిపించే ఆత్మీయత, సామూహికత, ఆచారాలు, ఔన్నత్యం వారికి మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని విదేశీయుల నుంచి పొగడ్తలు వినటం కొత్తేమి కాదు. ఈ క్రమంలో భారత్‌కు సరదాగా పర్యాటకు వచ్చి భారతావనిపై మనసు పారేసుకుని ఇక్కడే ఉండిపోయినా వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా భారత సంస్కృతి వైభవానికి మరోసారి ప్రపంచం సాక్ష్యమిచ్చింది. అమెరికాకు చెందిన క్రిస్టెన్ ఫిషర్ (Kristen Fisher from America) అనే యువతి, ఓ సాధారణ పర్యాటకురాలిగా భారత్‌కు వచ్చినా, ఇక్కడి జీవనరీతి ఆమె మనసును పూర్తిగా ఆకర్షించింది. ఈ దేశం ఆమెకు తాత్కాలిక గమ్యం కాదు.. జీవితాన్నే మార్చేసిన మైలురాయి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
'భారత్ నా హృదయాన్ని గెలిచింది' అని గర్వంగా చెప్పిన క్రిస్టెన్.. అమెరికాలో అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక సౌకర్యాలకంటే, భారత్‌లోని భావోద్వేగ సంబంధాలు, సాంప్రదాయాల తళుకులే గొప్పవని చెప్పింది. ఆమె భారత్‌కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్‌లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్‌నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్‌ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా.. పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను రుచి చూశానని మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో క్రిస్టెన్ హోలీ పండుగను జరుపుకుంటూ తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది.






