- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral news: ఐస్ శిల్పాల్లో జీవితం.. కరిగిపోతున్న క్షణాల్లో గొప్ప సందేశం
మానవ జీవితం ఎంతో అందమైన ప్రయాణం.

దిశ, వెబ్ డెస్క్: మానవ జీవితం ఎంతో అందమైన ప్రయాణం. అయితే, ఇది ఎవరికి ఎప్పటి వరకు ఉంటుందనే సంగతి ఎవరూ చెప్పలేరు. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలని పెద్దలు అంటారు. కానీ, చాలా మంది ఈ మాటలను పెడచెవిన పెడతారు. అలాంటి వారికి ఇటలీకి చెందిన ఓ కళాకారుడు జీవిత పరమార్థాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు.
ఇటలీకి చెందిన లూకా మార్టినీ అనే ప్రముఖ కళాకారుడు.. 'జీవితం చాలా చిన్నది, కరిగిపోక ముందే ఆస్వాదించండి (Life is short, enjoy it before it melts)' అనే శీర్షికతో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించాడు. ఈ ప్రదర్శనలో వందలాది ఐస్ ముక్కలతో చిన్న పిల్లలు, కౌమర దశ, యవ్వనం, వృద్ధాప్యం ఆకారాల్లో మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన అందమైన శిల్పాలను (Ice sculptures) ఏర్పాటు చేశాడు. అయితే, ఇవి ఒక్కొక్కటిగా కొన్ని గంటల్లోనే కరిగిపోయాయి. ఈ ప్రదర్శన ద్వారా లూకా అద్భుతమైన సందేశాన్ని తెలియజేశాడు.
అనంతరం అతడు మాట్లాడుతూ.. జీవితం కూడా ఐస్ ముక్కల వంటిదే కాలంతో పాటు కరిగిపోతుందని, ఉన్నంతసేపు సంతోషంగా గడుపాలని చెప్పారు. పర్యావరణ మార్పులపై చైతన్యం పెంచడంలో భాగంగా కూడా ఈ ప్రదర్శన ఒక మేల్కొలుపు అని లూకా తెలిపారు. బంగారం, వెండి కాదు.. నీరు కూడా శాశ్వతం కాదని, పూర్తిగా ప్రకృతి నాశనం అవ్వకముందే మనం మారాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. పలువురు సందర్శకులు కన్నీళ్లతో ఈ ప్రదర్శనను వీక్షించారంటే, ఆ కళ ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు.






