- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్మకాయలను కారుతో తొక్కించమంటే.. మొదటి అంతస్తు నుంచి పల్టీ కొట్టించిన యువతి
ఎన్నో ఆశలతో కొన్న కొత్త కారును.. ఏకంగా షోరూమ్ నుంచి బయటకు రాకముందే.. మొదటి అంతస్తు నుంచి ఓ యువతి పల్టీలు కొట్టించింది.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఆశలతో కొన్న కొత్త కారును.. ఏకంగా షోరూమ్ (Showroom) నుంచి బయటకు రాకముందే.. మొదటి అంతస్తు నుంచి ఓ యువతి పల్టీలు కొట్టించింది. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని మహేంద్ర కార్ షో రూమ్ (Mahindra Car Showroom)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న 29-ఏళ్ల మానీ పవార్ కొత్త థార్ (New Thar)ను కొనుగోలు చేసింది. అయితే తన కొత్త కారును తీసుకెళ్లే ముందు శుభం కలగాలని నిమ్మకాయలను వాహన చక్రం క్రింద నొక్కే ఆచారాన్ని పాటించారు. ఈ క్రమంలో ఆమె దురదృష్టవశాత్తూ తప్పుడు పెడల్ తొక్కడం తో ఆ కొత్త కారు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. దీంతో షోరూమ్ అద్దాలు బద్దలు కొట్టుకొని ఆ వాహనం మొదటి అంతస్తు నుంచి పల్టీలు కొట్టి (Flipped over) కింద పడిపోయింది.
ఆ సమయంలో వాహనంలో ఆమెతో పాటు షోరూమ్ ఉద్యోగి కూడా ఉన్నారు. అయితే కొత్త కారులో ఎయిర్‌బ్యాగ్లు (Airbags) వెంటనే తెరుచుకోవడంతో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కారు మాత్రం పూర్తి పల్టీకొట్టడంతో డ్యామేజ్ అయింది. అయితే కారు కింద పడ్డ సమయంలో ఆ మాల్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు, వీడియోల్లో.. తలకిందులుగా పడిపోయిన మహేంద్ర తార్ కొత్త వాహనం కనిసిస్తుండటంతో.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






