- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video: రన్‌వేపై ఊగిసలాట.. విమానానికి తప్పిన ప్రమాదం
జపాన్ లోని టోక్యోలో కొరియన్ ఎయిర్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్ డెస్క్: విమానాల ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల లాండింగ్, టేకాఫ్ సమయాలలో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా జపాన్ లోని టోక్యోలో కొరియన్ ఎయిర్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. నరిటా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈదురు గాలులు వీచాయి.
దీంతో ఫ్లైట్ ఒక్కసారిగా ఊగిసలాడి అందరికీ టెన్షన్ తెప్పించింది. రన్ వేకు టైర్లు తాగిన తర్వాత మళ్లీ పైకి ఎగిరింది. ఓ పక్కకు ఒరిగిపోతుండగా పైలట్ చాక చక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించారు. ఆ తర్వాత ప్రమాదం లేకుండా సురక్షితంగా పైలట్ ల్యాండ్ చేయడం గమనార్హం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Next Story






