సీలింగ్ ఫ్యాన్‌‌పై హాయిగా కూర్చున్న కింగ్ కోబ్రా.. ఎందుకంటే..?

by Disha Web Desk 14 |
సీలింగ్ ఫ్యాన్‌‌పై హాయిగా కూర్చున్న కింగ్ కోబ్రా.. ఎందుకంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంట్లోకి పాము వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? ఆ పామును బయటకు పంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు పాములు పట్టే వాళ్ళని పిలిచి దాన్ని బంధించి అడవిలో వదిలేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ వ్యక్తి ఇంట్లోకి పాము వస్తే దాన్ని తరమకుండా వీడియో తీసీ ఇన్‌స్టాగ్రాంలో రీల్ పెట్టాడు. ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌‌కు కింగ్ కోబ్రా వేలాడుతూ కన్పిస్తుంది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో పాము తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌పై పడుగ విప్పి హాయిగా కూర్చుని ఉంది. ఫ్యాన్ తిరుగుతున్న ఆ కోబ్రా మాత్రం కదలకుండా ఫ్యాన్ రెక్క పై నుంచి కిందకి చూస్తోంది. ఈ వీడియోలో ఆ పాము ఉన్న తీరుపై నెటిజన్లు మాత్రం తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పాము ఫ్యాన్ స్పీడ్ పెంచమని అడుగుతుందని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. స్నేక్ ఫ్యాన్‌పై కూర్చుని 360 డిగ్రిస్‌లో సెల్ఫీ తీసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. అరే వీడియో తీయకుండా.. ఫ్యాన్ ఆపరా బాబు అని నెటిజన్లు చెబుతున్నారు.

Next Story

Most Viewed