- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాట్సాఫ్ అపర్ణ మేడమ్ అంటున్న కేరళ వాసులు
ప్రస్తుతం కేరళ వాసులంతా మహిళా పోలీసు అధికారి అపర్ణ లవకుమార్ కు మీరు గ్రేట్ మేడమ్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం కేరళ వాసులంతా మహిళా పోలీసు అధికారి అపర్ణ లవకుమార్ కు మీరు గ్రేట్ మేడమ్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వమంటూ ఆ అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన వైనానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ నుండి జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న రోగిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అంబులెన్స్ ఓ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ శబ్దం వినిపిస్తున్నప్పటికీ, రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల ముందుకు కదలలేని స్థితిలో ఉంది.
కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ అపర్ణ లవకుమార్ పరిస్థితిని గమనించి వెంటనే తన వాహనం నుండి దిగి, అంబులెన్స్ ముందుకు పరిగెత్తుతూ ఇతర వాహనాలను పక్కకు జరపమని సూచించింది. నిముషంలో అంబులెన్స్ వెళ్ళడానికి చాలా దూరం పరుగెడుతూ దారి క్లియర్ చేసింది. అయితే ఇదంతా అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మీడియాలో వైరల్‌గా మారింది, నెటిజన్లు అపర్ణను 'రియల్ హీరో' అని కొనియాడుతూ.. హ్యాట్సాఫ్ మేడమ్ అంటున్నారు.






