సౌదీలో నివసించే కేరళ వ్యక్తికి జాక్‌పాట్

by Ajay Maddhiboyina |

ఈ మ‌ధ్య సౌదీలో ప‌నిచేస్తున్న భారతీయుల‌కు ల‌క్ క‌లిసి వ‌స్తోంది. ల‌క్కీ లాట‌రీలు కొంటూ జాక్ పాట్‌లు కొట్టేస్తున్నారు. తాజాగా సౌదీలో నివసించే కేరళ వాసిని అదృష్టం వ‌రించింది.

సౌదీలో నివసించే కేరళ వ్యక్తికి జాక్‌పాట్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య సౌదీలో ప‌నిచేస్తున్న భారతీయుల‌కు ల‌క్ క‌లిసి వ‌స్తోంది. ల‌క్కీ లాట‌రీలు కొంటూ జాక్ పాట్‌లు కొట్టేస్తున్నారు. తాజాగా సౌదీలో నివసించే కేరళ వాసిని అదృష్టం వ‌రించింది. సౌదీలో నివ‌సించే పీవీ రాజన్ అబుదాబి బిగ్ టికెట్ కొనుగోలు చేయ‌గా లాట‌రీలో 25 మిలియ‌న్ దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. అంతే భారత కరెన్సీలో సుమారుగా రూ.61.37కోట్లను గెలుచుకున్నాడు.

దీంతో అతడి ఆనందంలో అవదుల్లేకుండా పోయాయి. బతుకుదెరువు కోసం సౌదీ వెళితే అదృష్టం వ‌రించి కోటీశ్వ‌రుడు అయిపోయాడు. తాను 15ఏళ్లుగా లాట‌రీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాన‌ని పీవీ రాజ‌న్ వెల్ల‌డించారు. ఇక ఇటీవలే కేరళకు చెందిన పాల్ జోస్ అనే వ్యక్తి సైతం దుబాయ్ లో లక్కీ లాటరీ గెలుచుకున్నాడు. పదేళ్లలో పాల్ జోస్ రెండు సార్లు లక్కీ లాటరీ గెలుచుకోవడం విశేషం.

Next Story