- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టార్గెట్ పూర్తి చేయలేదని పనిష్మెంట్! ఉద్యోగి మెడలో బెల్ట్ కట్టి కుక్కలా మోకాళ్లపై వాకింగ్
కొచ్చిలోని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే వీడియో తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులకు యాజమాన్యం టార్గెట్ ఇవ్వడం గురించి అందరికీ తెలిసిందే. బాస్‌లు ఇచ్చిన టైమ్‌లో టార్గెట్ పూర్తి చేస్తే జీతం పెరగడం, బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు రావడం జరుగుతోంది. కొంత మంది ఉద్యోగులు మాత్రం బాస్ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేకపోతుంటారు. అలాంటి సమయంలో వారికి శాలరీల్లో కోత విధించడం, వార్నింగ్ లెటర్స్ లేదా ప్రమోషన్లు, బోనస్‌లు ఆగిపోతాయి. ఆ ఉద్యోగి తరుచూ అలానే చేస్తే చివరికి ఉద్యోగం నుంచి మేనేజర్ డిస్‌మిస్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా కేరళలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. కొచ్చిలోని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించే వీడియో తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయని వారిని కుక్కల్లా మెడలో బెల్ట్ కట్టి మోకాళ్లపై నడిచేలా చేస్తున్నారని వీడియో వైరల్ అవుతోంది. మరో వీడియోలో ఉద్యోగులను శిక్షగా తమను తాము బట్టలు విప్పించుకోమని బలవంతం చేస్తున్నట్లు చూపించారు. నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించారు. పోలీసుల కథనం ప్రకారం.. వైరల్ వీడియోను నాలుగు నెలల క్రితం చిత్రీకరించారని, ఆ మేనేజర్ ఇప్పుడు కంపెనీని విడిచిపెట్టారని పోలీసులు తెలుసుకున్నారు. ఒక మాజీ మేనేజర్‌కు కంపెనీ యజమానితో సమస్యలు ఉన్నాయని, కొత్త శిక్షణార్థులతో కలిసి ఆ వీడియోను చిత్రీకరించి, అది శిక్షణలో భాగమని చెప్పుకుంటూ సంస్థ యజమానిని కించపరచాలని ఈ విధంగా చేసినట్లు తెలిపారు. అయితే, పోలీసులు ఆ క్లిప్‌ను మోసపూరిత వీడియోగా ప్రకటించారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో, (Kerala Labour Department) రాష్ట్ర కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. కంపెనీలో జరిగిన అమానవీయ వేధింపులపై దర్యాప్తునకు ఆదేశించి.. పోలీసులను నివేదిక కోరింది. వైరల్ వీడియోలలో కనిపించిన ఉద్యోగుల పోలీసులు విచారించారు. ఈ సంఘటనకు ఉద్యోగులు మాజీ మేనేజర్‌ను నిందించారు. టార్గెట్ పూర్తి చేయడంలో విఫలమైన వారికి యాజమాన్యం ఇటువంటి శిక్షలు విధించేదని సంస్థ ఉద్యోగులుగా భావిస్తున్న కొంతమంది స్థానిక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఇక హైకోర్టు న్యాయవాది జైసింగ్ ఫిర్యాదు ఆధారంగా కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనపై కేసు నమోదు అయింది. ఈ విషయంలో నివేదిక సమర్పించాలని ప్యానెల్ జిల్లా పోలీసు చీఫ్‌ను ఆదేశించింది.






